వనమహోత్సవం లక్ష్యాలు సాధించాలి
ABN , Publish Date - Aug 04 , 2025 | 10:47 PM
వన మహోత్సవం కార్యక్రమం కింద మొక్కలు నాటే లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ విజయేందిరబోయి చెప్పారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
అధికారులతో సమీక్షలో కలెక్టర్ విజయేందిరబోయి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): వన మహోత్సవం కార్యక్రమం కింద మొక్కలు నాటే లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ విజయేందిరబోయి చెప్పారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వన మహోత్సవంతో పాటు వివిధ అంశాలపై సమీక్ష చేశారు. జిల్లాలో 58 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 63 శాతం మొక్కలు నాటి, రాష్ట్రంలో 12వ స్థానంలో ఉందని చెప్పారు. శాఖల వారీగా మొక్కల లక్ష్యం, సాధించిన ప్రగతిని కలెక్టర్ సమీక్షంచారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్, జడ్చర్ల, భూత్పుర్ మున్సిపాలిటీలలో మొక్కలు నాటడంలో ఆశించిన ప్రగతి లేదని తెలిపారు. కార్పొరేషన్‌తో పాటు మునిసిపాలిటీలలో లక్ష్యం వేగంగా పూర్తి చేయాలన్నారు. కావలసిన మొక్కల ఇండెంట్ ఇస్తే డీఆర్‌పీవో నుంచి సరఫరా చేస్తారని తెలిపారు. పాఠశాలలు, గురుకులాలు, కళాశాలల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని చెప్పారు. అందుకు ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. 40 వేల ఈత మొక్కలు ఉన్నాయని, ఎక్రైజ్ శాఖ వాటిని నాటించాలని అన్నారు అటవీశాఖ నర్సరీలో అందుబాటులో ఉన్నాయని, వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖలు రైతుల నుంచి ఇండెంట్ ఇస్తే సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మొక్కలు చనిపోయిన చోట కొత్త మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటి, అవి వృక్షాలుగా పెరిగేలా బతికించాలన్నారు. నాటిన మొక్కల వివరాలు టీసీఎ్‌ఫఐఎస్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసి, అప్‌డేట్ చేయాలని ఆయా శాఖలను కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఎ్‌ఫవో సత్యనారయణ పాల్గొన్నారు.