Share News

అణగారిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యం

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:31 PM

జనాభాలో 93 శాతానికి పైగా ఉన్న అణ గారిన వర్గాలకు రాజ్యాధికార మే లక్ష్యంతో బీసీ, ఎస్టీ, ఎస్టీ రైట్స్‌ రాజ్యాధికార సాధన జే ఏసీ పని చేస్తుందని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు బింగి రాము యాదవ్‌, కార్తీక్‌ ఏకలవ్య అన్నారు.

అణగారిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యం

వనపర్తి టౌన్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : జనాభాలో 93 శాతానికి పైగా ఉన్న అణ గారిన వర్గాలకు రాజ్యాధికార మే లక్ష్యంతో బీసీ, ఎస్టీ, ఎస్టీ రైట్స్‌ రాజ్యాధికార సాధన జే ఏసీ పని చేస్తుందని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు బింగి రాము యాదవ్‌, కార్తీక్‌ ఏకలవ్య అన్నారు. ఆదివారం జి ల్లా కేంద్రంలోని ఏకో పార్కులో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు ప్రత్యేక స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై సామాజి క న్యాయం, రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యం తో మార్చి 31న హైదరాబాద్‌లోని బాగ్‌లింగంప ల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ, ఎ స్సీ, ఎస్టీ జేఏసీ ఆవిర్భవించిందన్నారు. విశారద న్‌ మహారాజ్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని అణ గారిన వర్గాలన్నింటినీ ఏకం చేస్తు రాజ్యాధికా రం వైపు నడిపించేలా జేఏసీ ముందుకు సా గుతుందన్నారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎ స్టీ జేఏసీ జిల్లా కన్వీనర్‌గా చిలుక బాలరాజును రాష్ట్ర నాయకత్వం ఏకగ్రీవంగా నియమించడం జరిగిందన్నారు. జిల్లా జేఏసీ నాయకులు భోజ రాజు, దస్తగిరి, రామకృష్ణ, ఎల్లయ్య, ఎల్లస్వామి, నాగరాజు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 11:31 PM