యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:38 PM
ని రుద్యోగ యువతీ యు వకులకు ఉపాధి కల్ప నే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగో పాల్ రావు పేర్కొన్నా రు.
-రాష్ట్ర సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు
అమరచింత, జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : ని రుద్యోగ యువతీ యు వకులకు ఉపాధి కల్ప నే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగో పాల్ రావు పేర్కొన్నా రు. బుధవారం అమర చింత చేనేత హ్యాండ్లూ మ్ ఇండస్ట్రీని ఆయన సందర్శించి పరిశీలిం చారు. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్ కంపెనీ లో నేత కార్మికులు మగ్గంపై నేస్తున్న చీరలను వాటి తయారీ కోసం వాడే ముడి సరుకులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశానుసారం యువజన సర్వీసుల శాఖ ఆ ధీనంలో ఉన్న సెట్విన్ ద్వారా ఇక్కడ హ్యాం డ్లూమ్ కంపెనీని పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు శిక్షణ కేంద్రాలు ఉన్నా యని ఆయన అన్నారు. మంత్రి సూచన మేర కు మక్తల్ పట్టణంలో మరో ట్రైనింగ్ సెంట ర్‌ను ప్రారంభించుటకు ఇప్పటికే అక్కడ భవ నాన్ని సైతం చూసినట్లు ఆయన తెలిపారు. యువజన సర్వీసుల శాఖ సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్, అమర చింత చేనేత హ్యాండ్లూమ్ కంపెనీ సీఈ వో మహంకాళి చంద్రశేఖర్, డైరెక్టర్ పొబ్బతి వెం కటస్వామి, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్య క్షుడు మహేందర్ రెడ్డి, అరుణ్ కుమార్, తిరు మలేష్, విష్ణు, ప్రకాష్, శ్యామ్ పాల్గొన్నారు.