ప్రతీ ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యం
ABN , Publish Date - May 29 , 2025 | 11:06 PM
ప్రతీ ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా బల్దియాలో పనులు ప్రారంభించామని మునిసిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు.
- బల్దియాలో ఆరు నెలల్లో పనులు పూర్తి
- మునిసిపల్ కమిషనర్ నాగరాజు
కోస్గి, మే 29 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా బల్దియాలో పనులు ప్రారంభించామని మునిసిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు. గురువారం మునిసి పాలిటీ పరిధిలోని బృందావన్ కాలనీలో అమృత్ పథకం పైపులైన్ పనులను ఆయన ప్రారంభించారు. గతంలో పలు కాలనీల్లో అసం పూర్తిగా పనులు సాగాయని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో అమృత్ పథకం పైపులైన్ పూర్తి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు చేపట్టాలని, బల్దియాలో సుమారు రూ.400 కోట్లతో ప్రణాళికలు తయారు చేశార న్నారు. అందులో భాగంగానే ఈ పనులు ప్రా రంభించామన్నారు. కాలనీల్లోని ప్రజలంతా అధికారులకు, కాంట్రాక్టర్లకు సహకరించాలని కోరారు. అనంతరం జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడి అసంపూర్తిగా భగీరథ పనులు చేపట్టారని, తద్వారా ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగిందన్నారు. సీసీ రోడ్లు పగులగొట్టడం, మళ్లీ వేయకపోవడం, నీ రు సరిగ్గా రాక పైపులైన్లు లీకేజీ కావడం వంటి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ము ఖ్యమంత్రి నాణ్యతగా పనులు చేపట్టాలని ఆదే శించారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, మునిసి పల్ అధ్యక్షుడు బెజ్జురాములు, నాయకులు నా గులపల్లి నరేందర్, అన్నకిష్టప్ప, బానునాయక్, తుడుం శ్రీనివాస్, మాస్టర్ శ్రీనివాస్, బాలేష్, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.