రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
ABN , Publish Date - May 15 , 2025 | 10:56 PM
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
- ప్రమాద స్థలాల్లో అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలి
- కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, మే 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాలు లో రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ప్రమాదాలకు ఆ స్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బీచుపల్లి నుంచి పుల్లూరు జంక్షన్ వరకు ప్రమాద ప్రాంతాలను గుర్తించి, వాటిపై సోమవారం నాటికి పోలీస్, జాతీయ రహదారుల అధికారులతో సంయుక్త పరిశీలన జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎర్రవల్లి నుంచి గ ద్వాల వరకు ప్రమాద సూచిక బోర్డులు, హెచ్చరికల గుర్తులు, కల్వర్టుల మరమ్మతు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు. గద్వాల నుం చి రాయచూర్ మార్గంలో స్పీడ్ బ్రేకర్లు ఎత్తుగా ఉండటంతో ప్రమాదాలకు అవకాశం ఉన్నదని, వాటిని ప్రమాణాలతో అనుగుణంగా సవరించా లన్నారు. చెక్‌పోస్టుల వద్ద రాత్రి వేళల్లో సరైన వెలుతురు, సైన్‌బోర్డులు, బారికేడింగ్ ఉండేలా చూడాలని ఆదేశించారు. అవసరం మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిరుపయోగంగా వాటికి మరమ్మతు చేపట్టాలన్నారు. రోడ్డు ప్ర మాదాలు జరిగినప్పుడు పోలీస్ అధికారులే కా కుండా, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కూడా హాజరయ్యేలా చూడాలని, దీంతో ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి భవిష్యత్తులో జరగకుండా నివారణ చర్యలు తీసుకునే వీలుంటుందన్నారు. తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. హైవే పక్కన, జములమ్మ రోడ్డులో ఉన్న మద్యం దుకాణాలు, ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ఎక్సైజ్ అధికారులు పరిశీలించాలన్నారు. ప్రమాదాల ప్రాంతాలలో వెంటనే అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగులయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రగతి, దామోదర్‌రావు, వెంకట్‌రమణరావు, సిద్దప్ప, హిమాన్ష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.