మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:04 PM
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి
దేవరకద్ర/చిన్నచింతకుంట నవంబరు 25 (ఆంధజ్యోతి) : రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మునిసిపల్ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ పంక్షన్‌హలో కౌకుంట్ల, దేవరకద్ర మండలాలకు చెందిన మహిళలకు చీరల పంపిణీ చేసి, మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబంతో పాటు రాష్టం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అంతకుముందు మండలంలోని బస్వాయపల్లి, గద్దెగూడెం, చిన్నరామూర్, నాగారం, గ్రామాల బీటీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అదే విధంగా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి వేంకటేశ్వరస్వామి జాతర మైదానంలో ఆర్టీసీకి చెందిన రెండు కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆత్మకూరు వయా కొత్తపల్లి, దుప్పల్లి, అమ్మాపూర్, పేరూర్, కౌకుంట్ల మీదుగా హైదరాబాద్ వరకు ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసును, వనపర్తి వయా కొత్తకోట, కొత్తపల్లి, దుప్పల్లి, అమ్మాపూర్, చిన్నచింతకుంట, వడ్డెమాన్, దమగ్నాపూర్, రాంపూర్ గేట్, లంకాల, నర్వ, పాతర్‌చెడ్, మక్తల్ మీదుగా పల్లె వెలుగు బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెకట్రరి అరవింద్‌కుమార్‌రెడ్డి, మండల అధ్యక్షుడు అంజిల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మికాంత్‌రెడ్డి, దేవస్థాన ఛైర్మన్ నరసింహరెడ్డి, కురుమూర్తి ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ దీపిక పాల్గొన్నారు.
శిక్షణతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
మహబూబ్‌నగర్ అర్బన్ : శిక్షణతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఎదిర-దివిటిపల్లిలో గల అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో శిక్షణ పొంది, ఉద్యోగాలు పొందిన యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అమరరజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గ్రూప్ హెచ్‌ఆర్ జయకృష్ణ, సీఈవో నిరంజన్, ఇండస్ట్రీయల్ జీఎం యాదయ్య పాల్గొన్నారు.