Share News

మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయం

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:51 PM

మహిళలను కోటీఽశ్వరులను చేయాలనే సం కల్పాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అ మలు చేస్తున్నారని గ్రంథాలయ సంస్థ జి ల్లా చైర్మన్‌ నీలి శ్రీనివాసులు అన్నారు.

మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయం

  • జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ నీలి శ్రీనివాసులు

ఇటిక్యాల, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మహిళలను కోటీఽశ్వరులను చేయాలనే సం కల్పాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అ మలు చేస్తున్నారని గ్రంథాలయ సంస్థ జి ల్లా చైర్మన్‌ నీలి శ్రీనివాసులు అన్నారు. ఆది వారం ఇటిక్యాల మండలంలోని మునగాల గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన సం చార చేపల విక్రయ వాహనాన్ని గ్రామస్తురాలు అనూషమ్మకు అందజేస్తూ పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళల కోసం అనేక సం క్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వడ్డీలేని రుణాలు, ఉచిత రవాణా, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, వివిధ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి మహమ్మద్‌ సిరాజ్‌ మాట్లాడుతూ ప్ర భుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రతీ కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో రుక్మాంగదరెడ్డి, సాతర్ల జయచంద్రారెడ్డి, రామచంద్రరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి,సూర్యకాంతరెడ్డి, అనంతరెడ్డి, ఇబ్రహిం, వెంకటన్న, అల్లాబకాశ్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 11:51 PM