Share News

జిల్లాను వైద్య హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:29 PM

జిల్లాను వైద్య హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు.

జిల్లాను వైద్య హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

  • నర్సింగ్‌ కళాశాల భవనాల పరిశీలన

గద్వాల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాను వైద్య హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం మెడికల్‌ కళాశాల పక్కన నిర్మిస్తు న్న నర్సింగ్‌ కళాశాల, హాస్టల్‌ భవనాలను పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడు తూ అత్యవసర పరిస్థితిలో హైదరాబాద్‌, క ర్నూల్‌, రాయిచూర్‌ వంటి ప్రాంతాలకు అత్యవసర వైధ్యం కోసం వెళ్లకుండా గద్వాల జిల్లాలోనే 300 పడకల ఆసుపత్రి, మెడికల్‌ కళాశాల న ర్సింగ్‌ కళాశాల, అత్యవసర వైద్యసేవలు అందు బాటులోకి తెస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తెస్తున్నట్లు తెలిపా రు. నర్సింగ్‌ కళాశాల, హాస్టల్‌ భవనాలు, మెడికల్‌ కేర్‌ నిర్మాణం కోసం రూ.48కోట్లు ఖర్చు చే స్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ పనులు వచ్చే చివరివారంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిచే ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు. ఆసుపత్రిలో అన్నిరకాల వైద్య సదుపాయాలు, అందుబాటు లో ఉంచుతామన్నారు. ఆయన వెంట మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, మాజీ కౌన్సిల ర్లు మురళీ, నరహరి శ్రీనివాసులు, పూడూరు కృష్ణ, నరహరిగౌడ్‌, నాగులు యాదవ్‌, కురుమన్న, గోవిందు, నాగేంద్రయాదవ్‌ ఉన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 11:29 PM