Share News

కొడంగల్‌ దశ దిశ మార్చడమే లక్ష్యం

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:38 PM

రానున్న మూడేళ్లలో కొడంగల్‌ దశదిశ మార్చ డమే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగు తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ ని యోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు.

 కొడంగల్‌ దశ దిశ మార్చడమే లక్ష్యం
ఆసుపత్రిలో మార్చురీ నిర్మాణానికి భూమిపూజచేస్తున్న తిరుపతిరెడ్డి

- కాంగ్రెస్‌ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి

కోస్గి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రానున్న మూడేళ్లలో కొడంగల్‌ దశదిశ మార్చ డమే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగు తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ ని యోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం కోస్గి మునిసిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణం లోని ఉర్దూ మీడియం పాఠశాలలో 30 ల క్షలతో నిర్మించిన అదనపు తరగతిగదులను ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పించాలని ఎక్కడా ఇబ్బందిలేకుండా చూసుకోవాలని డీఈవో గోవిందరాజులు, ఎంఈవో శంకర్‌నా యక్‌ను ఆదేశించారు. అనంతరం కోస్గి సా మాజిక ఆరోగ్య కేంద్రంలో రూ.35 లక్షలతో మార్చురీ నిర్మాణా నికి, మరో రూ.15 లక్షల తో ఆసుప త్రికి వచ్చిన రోగు లు కూర్చునేం దు కు హాల్‌, మరో 12 లక్షలతో ఆసుప త్రి ప్రహరీ నిర్మా ణానికి భూ మిపూ జ చేశారు. అనం తరం ఆసుపత్రిలోని వసతుల ను పరిశీలిం చారు. అనంతరం విద్యుత్‌ శాఖ కార్యాల యంలో రూ.30 లక్షలతో నిర్మించిన ఏడీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కోస్గి సబ్‌డివిజన్‌ పరిధిలో పని చేస్తున్న స్పాట్‌బిల్లర్స్‌ అంతా తాము ఎంతో కాలంగా పనిచేస్తున్నామని తమను విద్యు త్‌వాక ఉద్యోగులుగా గుర్తిం చాలని వినతిప త్రం అందించారు. కార్యక్రమంలో కాడ అధికారి వెంకట్‌రెడ్డి, పీఆర్‌డీఈ విలోక్‌, వైద్యులు అ నుదీప్‌, విద్యుత్‌శాఖ ఎస్సీ వెంక టరమణ, డీఈ నర్సింగ్‌రావ్‌, ఏడీ సుధారా ణి, ఏఈ వెంకటేష్‌, కాంగ్రెస్‌ మండల అ ధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బెజ్జు రా ములు, నాయకులు నరేందర్‌ అ న్నకిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:38 PM