పేదల సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:32 PM
పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృ ష్ణారావు అన్నారు.
- ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
పాన్‌గల్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృ ష్ణారావు అన్నారు. ఆది వారం వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలో ని తెల్లరాళ్లపల్లి తండా వెంగళాయపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ద్వారా నిరుపేదలకు ఇల్లు మంజూరు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలలో ప్ర జలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముందు వరుసలో ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్, జడ్పీటీసీ మాజీ సభ్యు డు రవికుమార్, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మండల అభివృద్ధి అధికారి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.