Share News

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:31 PM

: రాష్ట్రంలోని మత్స్య కారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
- సోమశిల వద్ద కృష్ణానదిలో కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతూకుమారితో కలిసి చేప పిల్లలు వదిలిన జూపల్లి

- పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

- 100 శాతం సబ్సిడీతో 2.50 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తాం

కొల్లాపూర్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మత్స్య కారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతూ కు మారి, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ నిఖిల, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌లతో కలిసి ఆయన బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని సోమశిల వద్ద కృష్ణానదిలో ఒక లక్ష చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందని, మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మత్స్యకారులు అలవి వలలను ఉపయోగించరాదని మంత్రి హెచ్చరించారు. చేప పిల్లల సైజు బాగుండేలా, నాణ్యమైన చేప పిల్లలనే మత్స్యశాఖ అధికారులు పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. మ త్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం 100శాతం సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ చేస్తోందని తెలిపారు. కార్యక్ర మంలో సంబంధిత శాఖల అధికారులు, మత్స్యకారులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 11:38 PM