గ్రామాల అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Aug 22 , 2025 | 10:53 PM
గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలను కల్పించి అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్వేయమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు.
దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్
తాళ్లగడ్డ గ్రామానికి వెళ్లే బ్రిడ్జి ప్రారంభం
పనుల జాతరలో యువకులకు స్వయం ఉపాధి ప్రొసిడింగ్స్ అందజేత
మూసాపేట, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలను కల్పించి అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్వేయమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాళ్లగడ్డ గ్రామానికి వెళ్లే రోడ్డుపై రూ.1.25 లక్షలతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని ముఖ్యఅతిథిగా హాజరై ప్రా రంభించారు. అడ్డాకులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమానికి హాజరై, 15 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధికి సంబంధించిన ప్రొసిడింగ్‌లను అందించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతులు లక్ష్యంగా పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గ్రామీణ యు వకులు స్వయం ఉపాధి కింద ప్లాస్టిక్ వెస్ట్ మేనేజ్‌మెంట్, సెగిగ్రేషన్‌షెడ్‌లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులు, పశువులు, కోళ్ల షెడ్లు తదితర ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్, తోట శ్రీహరి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, మాజీ ఎంపీపీలు బగ్గి కృష్ణయ్య, నాగార్జున్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు రామన్‌గౌడ్, బాలనర్సింహులు పాల్గొన్నారు.