Share News

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

ABN , Publish Date - May 08 , 2025 | 11:15 PM

ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్‌ పిలుపునిచ్చారు.

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న సాగర్‌

- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్‌

నారాయణపేట, మే 8 (ఆంధ్రజ్యోతి): ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్‌ పిలుపునిచ్చారు. గురువారం నారాయణపేట సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి గోపాల్‌ అధ్యక్షతన కార్మిక, కర్షక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సాగర్‌ మాట్లాడుతూ ఈనెల 8 నుంచి 15 వరకు జీపుజాతాలు, మోటర్‌ సైకిల్‌ ర్యాలీలు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలన్నారు. 16 నుంచి 19 వరకు గ్రా మాల్లో ప్రదర్శనలు చేపట్టాలన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాల న్నారు. 45వ లేబర్‌ సదస్సు సిఫారసు మేరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. గతంలో రైతాంగానికి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిన కేంద్రం స్వామినాథన్‌ కమిషన్‌ సూచించినట్లు సమగ్ర ఉత్పత్తి ఖర్చు సి-2కు 50 శాతం కలిపి మద్దతు ధరను నిర్ణయించాలన్నారు. వ్యవసాయేత్పత్తుల సేకరణ కొనసాగాలన్నారు. ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పనిదినాలను పెంచి, రోజు కూలి రూ.600 ఇవ్వాలన్నారు. వ్యవసాయ కార్మికులకు కనీస పెన్షన్‌ పెంచాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, బాల్‌రామ్‌, అశోక్‌, అంజిలయ్యగౌడ్‌, సౌభాగ్య, కాశీనాథ్‌, నరహరి, శివకుమార్‌, బాలప్ప, తిమ్మప్ప, జ్యోతి తదితరులున్నారు.

మెప్మా పీడీకి సమ్మె నోటీసు అందజేత

ఈనెల 20న చేపట్టబోయే సమ్మె నోటీసును స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌, ఇన్‌చార్జి మెప్మా పీడీ భోగేశ్వర్లుకు మెప్మా ఆర్పీల యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు సౌభాగ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్‌లు అం దించారు. కార్యక్రమంలో జ్యోతి, రాధిక తదితరులు ఉన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:15 PM