Share News

గద్వాలను టాప్‌టెన్‌లో నిలపాలి

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:02 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ బీఎం సం తోష్‌ అన్నారు.

గద్వాలను టాప్‌టెన్‌లో నిలపాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాన్ని వేగంగా పూర్తిచేయాలి

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ బీఎం సం తోష్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలు లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మా ట్లాడారు. మండలాల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వందశాతం ఇంటి నిర్మాణ పనుల లక్ష్యాలను చేరుకోవాలని, ప్రత్యే క చొరవ తీసుకొని వివిధ దశలలో ఉన్న వాటి ని పూర్తి చేయాలన్నారు. అవసరమైన ఇసుకు అందుబాటులో వచ్చినందున పనులను వేగవంతం చేసి జిల్లాను రాష్ట్ర స్ధాయిలో టాప్‌టెన్‌లో నిలపాలన్నారు. గద్వాల నియోజకవర్గంలో కొత్తగా 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రొసీడింగ్‌ అందించడం జరిగిందని, పంచా యతీ ఎన్నికల కోడ్‌ అమలులో రాకముందే మార్క్‌ అవుట్‌ పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే మంజూరయ్యి నిర్మాణాలకు ఆసక్తి చూపని 1,197 మంది గృహాల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నర్సింగారావు, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, డీపీవో నాగేంద్రం, ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు ఉన్నారు.

స్ధానిక సంస్థల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమ ర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సం ఘం కమిషనర్‌ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీసీ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ బీఎం సంతోష్‌, ఎస్పీ శ్రీనివాసరావు, అదన పు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, అడి షనల్‌ ఎస్పీ శంకర్‌, డీఎస్పీ మొగులయ్య, డీపీవో నాగేంద్రం, అధికారులు ఉన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:02 PM