Share News

ప్రారంభమైన మొదటి దశ నామినేషన్ల పర్వం

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:39 PM

మొదటి దశ సర్పంచ్‌ ఎన్నికల కోసం గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

ప్రారంభమైన మొదటి దశ నామినేషన్ల పర్వం
చాగదోణలో తమ మద్దతుదారుడితో సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేయిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు

గట్టు/ధరూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మొదటి దశ సర్పంచ్‌ ఎన్నికల కోసం గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలకు సంబంధించి 8 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిట్టదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవికి -2, ఆలూరు-2, అంతంపల్లి-2, బల్గెర-2, చాగదోణ గ్రామ పంచాయతీ సర్పంచ్‌కి -4, ఛమన్‌ఖాన్‌దొడ్డి-1, గంగిమాన్‌దొడ్డి-1, గట్టు-1, ఇందువాసి-1, మాచర్ల-2, రాయపురం-2, వాయిలకుంట తాండ -1, యల్లందొడ్డి-1 చొప్పున మొత్తం 22 మంది అభ్యర్థులు సర్పంచ్‌ స్థానానికి నామినేషన్లు వేశారని, వార్డు సభ్యులకు మూడు నామినేషన్లు సమర్పించారని రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు. చాగదోణ గ్రామ పంచాయతీకి సంబందించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గ్రామానికి చేరుకుని పార్టీ మద్దతుదారునితో నామినేషన్‌ వేయించారు.

ధరూర్‌లో 12 నామినేషన్లు

ధరూరు మండలంలో ఏర్పాటు చేసిన ఏడు నామినేషన్‌ కేంద్రాల్లో మొదటి రోజు గురువారం 12 నామినేషన్లు దాఖలయ్యాయని ఇన్‌చార్జి ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. ద్యాగదొడ్డి నామినేషన్‌ కేంద్రం నుంచి నాగర్‌దొడ్డికి ఐదు నామినేషన్లు, ఉప్పేరు కేంద్రంలో ఉప్పేరు గ్రామానికి సంబంధించి మూడు నామినేషన్లు, గార్లపాడు గ్రామానికి సంబంధించి నాలుగు దాఖలయ్యాయని తెలిపారు.

కేటిదొడ్డిలో : కేటిదొడ్డి మండల పరిధిలోని ఏడు నామినేషన్‌ కేంద్రాల్లో మొదటిరోజు గురువారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని అధి కారులు తెలిపారు. కేటిదొడ్డి గ్రామం నుంచి మూడు, మైలగడ్డ నుంచి రెండు, గంగన్‌పల్లె నుంచి ఒకటి, మొత్తం ఆరు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Nov 27 , 2025 | 11:39 PM