మూడో విడత తొలిరోజు మందకొడిగా
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:35 PM
: సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు మూడో విడతకు చేరుకున్నాయి. తొలి రోజు బుధవారం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో నామినేషన్లు తక్కువగా వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్, జడ్చర్ల, మూసాపేట, అడ్డాకుల, బాలానగర్ మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు.
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో తక్కువగా దాఖలైన నామినేషన్లు
సర్పంచ్ స్థానాలకు పాలమూరులో 81, ‘పేట’లో 60..
మహబూబ్‌నగర్/నారాయణపేట, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు మూడో విడతకు చేరుకున్నాయి. తొలి రోజు బుధవారం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో నామినేషన్లు తక్కువగా వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్, జడ్చర్ల, మూసాపేట, అడ్డాకుల, బాలానగర్ మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. తొలి రోజు బుధవారం నామినేషన్లు మందకొడిగా వచ్చాయి. మూసాపేట, అడ్డాకుల మండలాల్లో మరీ తక్కువగా వచ్చాయి. సర్పంచ్‌లకు 81, వార్డు సభ్యులకు 165 నామినేషన్లు వచ్చాయి. భూత్పూర్ మండలంలో 19 సర్పంచ్, 174 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జడ్చర్లలో 45 సర్పంచ్, 376 వార్డు స్థానాలకు, మూసాపేటలో 15 సర్పంచ్, 138 వార్డు, అడ్డాకులలో 17 సర్పంచ్, 156 వార్డు, బాలానగర్‌లో 37 సర్పంచ్, 308 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 5 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది.
ఫ నారాయణపేట జిల్లాలో మాగనూర్, కృష్ణ, మక్తల్, నర్వ, ఊట్కూర్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 110 సర్పంచ్ స్థానాలకు 60, 990 వార్డు స్థానాలకు 66 నామినేషన్లు వేశారు.