Share News

నిజాలు నిర్భయంగా రాయాలి

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:16 PM

వార్తా పత్రికల్లో నిజాలు నిర్భ యంగా రాసి ఆదర్శంగా నిలవాలని సామాజిక కార్యకర్త కమ్మరి గోపి పిలుపునిచ్చారు.

నిజాలు నిర్భయంగా రాయాలి

ఖిల్లాఘణపురం ,నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : వార్తా పత్రికల్లో నిజాలు నిర్భ యంగా రాసి ఆదర్శంగా నిలవాలని సామాజిక కార్యకర్త కమ్మరి గోపి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ప్రెస్‌ క్లబ్‌లో జాతీయ పత్రిక దినో త్సవం సందర్భంగా ఆదివారం ఖిల్లాఘణపురం ప్రెస్‌ క్లబ్‌ సభ్యులను సామాజిక కార్యకర్త క మ్మరి గోపి శాలువాతో ఘనంగా సత్కరించి కేక్‌ కట్‌ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సమాజంలో ఆర్థిక, జాతీయ, సామాజిక, అన్ని వర్గాల అంశాలను సమన్వయం చేస్తూ ని ష్పక్షపాతంగా వార్తలు రాసి పత్రికా విలేకరులు మార్గదర్శకంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పునకు పత్రికల్లో వచ్చే అక్షరా లు కీలకంగా మారతాయని అన్నారు. కార్యక్ర మంలో ఏఎస్‌ఐ సత్యనారాయణ గౌడ్‌, ప్రెస్‌క్లబ్‌ సభ్యులు కృష్ణణ్య, సత్యం, యాదయ్య, సాయి లు, శాంత కుమార్‌, విజయ్‌ కుమార్‌ గ్రామ పె ద్దలు లింగమయ్య, పురుషోత్తం, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:16 PM