Share News

తాగునీటి సమస్య పరిష్కరించాలి

ABN , Publish Date - May 18 , 2025 | 11:27 PM

మండల పరిధిలోని రేమద్దులలో 20 రోజులుగా తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నా.. పట్టించుకోని పా లకవర్గం అధికారులు.. తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాల ని రైతు సంఘం నాయకులు భా స్కర్‌, శ్రీనివాసులు డిమాండ్‌ చే శారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలి

పాన్‌గల్‌, మే 18 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని రేమద్దులలో 20 రోజులుగా తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నా.. పట్టించుకోని పా లకవర్గం అధికారులు.. తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాల ని రైతు సంఘం నాయకులు భా స్కర్‌, శ్రీనివాసులు డిమాండ్‌ చే శారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ... గ్రామానికి మెయిన్‌ బోర్‌ వాటర్‌ లైన్‌ పగిలిపోయి నీటి సరఫరా లేక కోనేరు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించకుంటే ప్ర జలతో కలిసి గ్రామ సచివాలయం వఎదుట ధ ర్నా రాస్తారోకో కార్యక్రమం చేపడతామని హె చ్చరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ నాయ కులు మల్లేష్‌, అవాజ్‌ సంఘం నాయకులు ఎం డీ ఖాజా, గ్రామస్థులు ఎర్రడి రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 11:27 PM