పేదల సొంతింటి కల సాకారం
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:42 PM
గద్వాల మండల పరిధిలోని మదనపల్లి గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి కా వడంతో గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరై ప్రారంభించారు.
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల
గద్వాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గద్వాల మండల పరిధిలోని మదనపల్లి గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి కా వడంతో గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. అలాగే జిల్లా కేంద్రంలోని 24వ వార్డు కు చెందిన రేణుక నూతన గృహప్రవేశానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం తేనేటి విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు చేపట్టిన పదకం ఇం దిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తికావడం లబ్దిదారు లు నూతన గృహప్రవేశం చేయడం ఎంతో సం తోషంగా ఉన్నదన్నారు. ప్రజాపాలనలో భాగం గా గద్వాల నియోజకవర్గంలోని గద్వాల మండలపరిదిలోని మదనపల్లిలో మొట్టమొదటి ఇంది రమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగిందని, నేడు ఇల్లు పూర్తి నిర్మాణం చేసుకొని ప్రారంభించడం జరిగిందన్నారు. గద్వాల నియోజకవర్గం లో మొదటి విడతలో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా దాదాపు 1500 పైగా ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. త్వ రగా ఇంటి నిర్మాణం పనులు పూర్తిచేసుకొని గృహప్రవేశాలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇ ల్లు మంజూరు చేసి నిర్మాణానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గద్వాల నియోజకవర్గ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, నాయకులు మైలగడ్డ చంద్రశేఖర్, కృష్ణ తదితరులు ఉన్నారు.