Share News

పేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇంటితోనే సాధ్యం

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:18 PM

గద్వాల నియోజకవర్గానికి సంబంధించి వివిధ గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌, గద్వాల ప ట్టణ ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.

పేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇంటితోనే సాధ్యం

  • గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల న్యూటౌన్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం గద్వాల నియోజకవర్గానికి సంబంధించి వివిధ గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌, గద్వాల ప ట్టణ ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని 750 మంది ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాధీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడపడుచుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి కళ్యాణలక్ష్మి పథకం పెళ్లిళ్లకు కానుకగా రూ.1,00,116 అందించడం జరుగుతుందన్నారు. ఈ చెక్కులను పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. కార్యక్రమం లో నాయకులు ఉన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:19 PM