పేదల సొంతింటి కల నెరవేరింది
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:23 PM
పేద ప్రజల సొంతిటి కల నెరవేరిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
ఆరగిద్దలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి
గట్టు, నవంబరు 10 (ఆంధజ్యోతి) : పేద ప్రజల సొంతిటి కల నెరవేరిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిదిలోని ఆరగిద్ద గ్రామంలో పూర్తి అయిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నియోజ కవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు ఆరగి ద్దలో ప్రారంభించామన్నారు. మొదటి దశలో గ్రామంలో మాదిగుండు లక్ష్మీ, కుమ్మరి సుజాత, మాల పార్వతమ్మకు ఇందిరమ్మ ఇళ్లు మంజూర య్యాయి. వీటి నిర్మాణం పూర్తి కావడంతో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించా రు. కార్యక్రమంలో ఎంపీడీవో చెన్నయ్య, పీఏసీ ఎస్ చైర్మన్ క్యామ వెంకటేశ్, సీనియర్ నాయకులు రమేశ్‌నాయుడు, శ్రీధర్‌గౌడు, విజేయ్, మధుసూదన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.