Share News

చీరల పంపిణీ విజయవంతం చేయాలి

ABN , Publish Date - Nov 19 , 2025 | 11:24 PM

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల ఉన్నతి.. తెలంగాణ ప్రగతి పేరున ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.

చీరల పంపిణీ విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

- కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల ఉన్నతి.. తెలంగాణ ప్రగతి పేరున ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో కలిసి ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు ఇందిర మహిళా శక్తి చీర పంపిణీ చే సేందుకు కార్యచరణ రూపొందించాలన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్‌, మధుసూదన్‌ నాయ క్‌, జడ్పీ సీఈవో వెంక ట్‌ రెడ్డి, డీపీవో నిఖిల పాల్గొన్నారు.

నేటి నుంచి లిసెన్‌ టు చిల్డ్రన్‌ కార్యక్రమం

జిల్లాలో నేటి నుంచి అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్‌ సహకారంతో ప్రయోగాత్మకంగా లిసెన్‌ టు చిల్డ్రన్‌ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ విజయేందిర బోయి తెలిపారు. జిల్లాలోని 17 మండలాలు, మూడు మునిసిపాలిటీల్లో 22 చోట్ల ఈ నెల 20న కార్యక్రమం నిర్వహించుటకు మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పంచాయతీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మునిసిపల్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో సజెషన్‌ బాక్స్‌లు ఏర్పాటు చేశామని, 20న సూ చనలు, సమస్యలను పిల్లలు అందిచవచ్చని తెలిపారు. అదే విధంగా హెల్ప్‌లైన్‌, వాట్పాప్‌ 9154784095 వివరించవచ్చని తెలిపారు.

మద్యం దుకాణానికి లక్కీడిప్‌

మహబూబ్‌నగర్‌ : పాలమూరు నగరంలోని 16వ నెంబర్‌ మద్యం దుకాణానికి బుధవారం క లెక్టరేట్‌లో కలెక్టర్‌ విజయేందిర బోయి ఆధ్వర్యం లో లక్కీడిప్‌ నిర్వహించారు. ఈ దుకాణానికి 29 మంది దరఖాస్తు చేసుకోగా, లక్కీడిప్‌లో ప్ర భుత్వ ఉపాధ్యాయురాలికి అదృష్టం వరించింది. ఆమెను సస్పెండ్‌ చేయడంతో లైసెన్స్‌ను రద్దు చేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ను కోరింది. దీంతో రీటెండర్‌ నిర్వహించారు. ఇందులో 28 మంది దరఖాస్తుదారులు పాల్గొనగా, 22వ నెంబర్‌ జె ట్టం శ్రీనును అదృష్టం వరించగా, లైసెన్స్‌ ఫీజు మొదటి విడత రూ.10.83 లక్షలు చెల్లించారు. జి ల్లా ఎక్సైజ్‌ అధికారి సుధాకర్‌, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ అధికారి నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఉపా ధ్యా యురాలు ఇది వరకు చెల్లించి మొదటి విడత లైసెన్స్‌ ఫీజును ప్రభుత్వం జప్తు చేసుకుంది.

Updated Date - Nov 19 , 2025 | 11:24 PM