మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:01 PM
కల్లు తాగే అలవాటు ఉన్న ఓ మహిళ మతిస్థిమితం కోల్పోయి, అదృశ్యమైంది. ఈ సంఘటన శనివారం భూత్పూర్ మండలంలో చోటు చేసుకుంది.
భూత్పూర్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కల్లు తాగే అలవాటు ఉన్న ఓ మహిళ మతిస్థిమితం కోల్పోయి, అదృశ్యమైంది. ఈ సంఘటన శనివారం భూత్పూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన బోయచెన్నమ్మకు కల్లుతాగే అలవాటు ఉంది. ఈ మధ్య మతిస్థిమితం కోల్పోయింది. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎవరికీ చెప్పకుండా వెళ్లి పోయింది. ఈ విషయమై చెన్నమ్మ కుమారుడు బోయ శ్రీహరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.