గత పాలకుల పాపమే ధరణి చట్టం
ABN , Publish Date - May 03 , 2025 | 11:36 PM
గత పాలకు ల పాపమే ధరణి చట్టం అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
పాన్‌గల్, మే 3 (ఆంధ్రజ్యోతి): గత పాలకు ల పాపమే ధరణి చట్టం అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భూ భారతి చట్టం 2025పై వనపర్తి జిల్లా పాన్‌గల్ పట్టణంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు ను వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆ యన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ... గతంలో ధరణి చట్టం వల్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని అన్నారు. ఫిర్యాదులు చేద్దామంటే ధరణిలో అవకాశాలు లేవన్నారు. అందువల్ల ధరణిలో వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకు వచ్చిందని తెలిపారు. విరాసత్‌లో జరిగిన తప్పులను సరి చేసుకోవడం, జరిగిన తప్పులకు అప్పీల్ చేసుకునే అవకాశం భూ భారతిలో ఉంటుందన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ... ప్రభుత్వం కొత్తగా ఏ చట్టం తీసుకువచ్చిన ఆ చట్టంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని అందుకే కొత్తగా వచ్చిన భూ భారతి ఆర్‌వో ఆర్ చట్టంపై మండల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధ్దన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ సైతం చట్టం గురించి ప్రజలకు వివరించారు. అనంతరం 80 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్‌డీవో పీడీ ఉమాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, తహసీల్దార్ పాల్గొన్నారు.