Share News

‘సురవరం’ మృతి తీరని లోటు

ABN , Publish Date - Aug 23 , 2025 | 11:07 PM

సురవరం సుధాకర్‌ రెడ్డి మరణం దేశానికి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనే యులు అన్నారు.

‘సురవరం’ మృతి తీరని లోటు
గద్వాల కృష్ణవేణి చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళి అర్పిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

- సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు

గద్వాల టౌన్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : సురవరం సుధాకర్‌ రెడ్డి మరణం దేశానికి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనే యులు అన్నారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సురవరం సుధాకర్‌ రెడ్డి చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వామపక్ష భావజాలంతో విద్యార్థి దశ నుంచే సామాజిక రంగంలోకి అడుగేసిన సురవరం, భారత కమ్యూనిస్టు పార్టీలో క్రీయాశీలకంగా పనిచేశారన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యద ర్శిగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి పార్టీ జాతీయ కార్యదర్శి గా సేవలందించారన్నారు. చివరి శ్వాస వరకు ప్రజా పోరాటాల్లో భాగస్వామిగా నిలిచిన ఆయ న సేవలు పార్టీ శ్రేణులకు స్ఫూర్తిదాయక మన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌ రావు, ఉప్పేరు కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

ప్రజాసంఘాల ఘన నివాళి

సురవరం సుధాకర్‌రెడ్డికి ప్రజాసంఘాల నా యకులు శనివారం రాత్రి పట్టణంలోని కృష్ణ వేణి చౌరస్తా వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిం చిన నివాళులర్పించారు. కార్యక్రమంలో నాగర్‌ దొడ్డి వెంకట్రాములు, ఆలూరు ప్రకాష్‌ గౌడ్‌, శంకర ప్రభాకర్‌, ఆంజనేయులు, నరసింహ, కు రువపల్లయ్య, సుభాన్‌ పాల్గొన్నారు.

ఉండవల్లిలో..

ఉండవల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం సురవరం సుధాకర్‌ రెడ్డి చిత్రపటానికి ఎంఈవో రామకృష్ణ ఘనం గా నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడు తూ ఉండవల్లి మండల కేంద్రానికి చెందిన సురవరం సుధాకర్‌ రెడ్డి తన జీవితకాలం గ్రా మాభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. కార్యక్ర మంలో హెచ్‌ఎం శ్యామల, శేషన్‌గౌడ్‌, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 11:07 PM