రాజ్యాంగం.. శక్తివంతమైన మార్గదర్శక గ్రంథం
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:18 PM
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం.. పుస్తకం మాత్రమే కాదని అది ఒక శక్తివంతమైన మార్గదర్శక గ్రంథమని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్‌నాయక్ పేర్కొన్నారు.
అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్‌నాయక్
గద్వాల సర్కిల్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం.. పుస్తకం మాత్రమే కాదని అది ఒక శక్తివంతమైన మార్గదర్శక గ్రంథమని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్‌నాయక్ పేర్కొన్నారు. గద్వాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం జిల్లా న్యా యసేవాధికార సంస్థ ఆధ్వర్యాన నిర్వహించిన జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు న్యా యాధికారి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం సమాజ సేవలో తమవంతు పాత్ర పోషిస్తామని న్యాయాధికారితో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ, అధ్యాపకులు, గద్వాల సెక్టార్ ఎస్సై జహంగీర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు రాజేందర్, శ్రీనివాసులు, లక్ష్మన్న, స్వామి, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.