Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజమైన రైతు పక్షపాతి

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:26 PM

గత ప్రభుత్వానికి కంటే ఎక్కువగా రైతుభరోసా నిధులు అందజేయడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజమైన రైతు పక్షపాతిగా నిలిచిందని గద్వాల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ లత్తిపురం వెంకట్రామిరెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజమైన రైతు పక్షపాతి
గద్వాలలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

  • మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి

  • సీఎం చిత్రపటానికి కాంగ్రెస్‌ నాయకుల క్షీరాభిషేకం

గద్వాల టౌన్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వానికి కంటే ఎక్కువగా రైతుభరోసా నిధులు అందజేయడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజమైన రైతు పక్షపాతిగా నిలిచిందని గద్వాల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ లత్తిపురం వెంకట్రామిరెడ్డి అన్నారు. రైతభరోసా నిధులను రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లోగా జమచేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికే దక్కుతుం దన్నారు. ఇందుకు కృతజ్ఞతగా పార్టీ ఆధ్వర్యం లో రైతులతో కలిసి మంగళవారం పట్టణంలోని పాతబస్టాండ్‌ సర్కిల్‌లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇసాక్‌, శ్రీనివాస్‌గౌడ్‌, అల్వాల్‌ రాజశేఖర్‌రెడ్డి, భాస్కర్‌యాదవ్‌, ఆనంద్‌గౌడ్‌, డీటీడీసీ నరసింహ, కౌసర్‌బేగ్‌, కరాటే సత్యం, కృష్ణయ్యగౌడ్‌, నారాయణ, శ్రీనివాసులు, రంగస్వామి, మోమిన్‌, అయ్యప్ప, మద్దిలేటి, ఆంజనేయులు, భాస్కర్‌, లక్ష్మణ్‌ ఉన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:26 PM