Share News

ఘనంగా కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:44 PM

దేశ అభివృద్దిలో కాంగ్రెస్‌ పార్టీ సుస్థిర స్థానం కలిగి ఉందని నేటికి 141ఏళ్లు గడించిందని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ సరితలు అన్నారు.

ఘనంగా కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం
కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న సరిత, హాజరైన నాయకులు

  • గద్వాలలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలకు ఘన నివాళి

  • తెలంగాణలో ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్‌ : సరిత

గద్వాల, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): దేశ అభివృద్దిలో కాంగ్రెస్‌ పార్టీ సుస్థిర స్థానం కలిగి ఉందని నేటికి 141ఏళ్లు గడించిందని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ సరితలు అన్నారు. కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్బంగా సరిత క్యాంపు కార్యాలయంలో జెండావిష్కరణ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ... సుదీర్ఘకాలంపాటు దేశాన్ని పాలించిన పార్టీ, దేశాభివృద్దికి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని వివరించారు. దేశస్వాతంత్య్రంలో కూడ కాంగ్రెస్‌ తన పాత్రను పోషించిందని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తున్నదని పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని వివరించారు. అంతేకాకుండా మహిళా సంక్షేమం పేరుతో మహిళలను లక్షాధికారులను చేసే దిశగా కృషి చేస్తున్నదని వివరించారు. సామాజిక భద్రత ద్వార ప్రజల జీవితాలలో మార్పులు తెస్తున్నదని వివరించారు. పాలనతో పారదర్శకత, బాధ్యతతో పాటు ప్రజలలో మమేకమై సమస్యలను పరిష్కరించే విధానాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తోందని వివరించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయాలంటే నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామంలో ప్రజల మధ్య ఉండి పార్టీ విధానాలను వివరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ సిద్దాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే 141వ ఆవిర్భావ దినోత్సవానికి నిమజమైన గౌరవం అని పేర్కొన్నారు. అనంతరం గద్వాల పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి మహాత్మాగాందీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఇసాక్‌, జిల్లా యువజన కాంగ్రెస్‌ అద్యక్షులు తిరుమలేష్‌, నాయకులు మధుసూదన్‌బాబు, డీఆర్‌ శ్రీధర్‌, టీఎన్‌ఆర్‌ జగదీష్‌, గోనుపాడు శ్రీనివాస్‌ గౌడ్‌, కబీర్దాస్‌ నర్సింహులు వివిద గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 11:44 PM