Share News

చలి కొరికేస్తోంది..

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:09 PM

జిల్లాలో చలి చంపేస్తోంది. నాలుగు రోజుల నుంచి తీవ్రత పెరిగింది. చీకటిపడగానే వీస్తున్న చల్ల గాలులకు జనం అల్లాడుతున్నారు. పాలమూరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు వారం క్రితం 23 ఉండగా, మంగళవారం 18 డిగ్రీలకు పడిపోయింది.

చలి కొరికేస్తోంది..
పాలమూరులో చలిమంట కాచుకుంటున్న నగరవాసులు

నాలుగు రోజులుగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

23 నుంచి.. 18 డిగ్రీలకు తగ్గుదల

సాయంత్రం 6 గంటలైతే బయట తిరగలేని పరిస్థితి

మహబూబ్‌నగర్‌, నవంబరు 11 (ఆంధజ్యోతి): జిల్లాలో చలి చంపేస్తోంది. నాలుగు రోజుల నుంచి తీవ్రత పెరిగింది. చీకటిపడగానే వీస్తున్న చల్ల గాలులకు జనం అల్లాడుతున్నారు. పాలమూరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు వారం క్రితం 23 ఉండగా, మంగళవారం 18 డిగ్రీలకు పడిపోయింది. 6 డిగ్రీలు తగ్గింది. సోమవారం 17 డిగ్రీలే నమోదు కావడం గమనార్హం. వారం క్రితం వరకు వర్షాలు కురవడంతో ఉక్కపోత పోసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో రాత్రి అయ్యిందంటే బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున చలికితోడు మంచు కురుస్తుండటంతో ఆ సమయంలో పనులు చేసుకునే వారికి తిప్పలు తప్పడం లేదు. పాల వ్యాపారులు, కూరగాయల రైతులు, మునిసిపల్‌ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్‌ వాకర్స్‌, అయ్యప్ప భక్తులు, కార్తీక పౌర్ణమి వేళ తెల్లవారుజామునే పూజలు చేసుకునే మహిళలు, బడికి పిల్లలను పంపించే తల్లులు, పేపర్‌బాయ్స్‌, ప్రయాణం చేసేవారు, డ్రైవర్‌లు చలికి తట్టుకోలేకపోతున్నారు. మరో వారం, పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రత్యామ్నాయాల ఏర్పాటు

చలికి ప్రజలు స్వెటర్లు, మంకీ క్యా్‌పలు ధరిస్తున్నా రు. నగరంలో ఫుట్‌పాత్‌లపై స్వెటర్ల విక్రయాలు జోరందుకున్నారు. దుకాణాలలో స్వెటర్లకు ఆర్డర్లు పె డుతున్నారు. చలికి చేతులు, కాళ్లు పొడిబారడం, పెదాలు పగులుతుండటంతో కోల్డ్‌ క్రీ మ్‌లు వినియోగిస్తున్నారు. కప్పుకునేందుకు ఉలన్‌ రగ్గులు వాడుతున్నారు.

Updated Date - Nov 11 , 2025 | 11:09 PM