Share News

కూటమి సర్పంచుల చూపు ఎమ్మెల్యే వైపు

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:52 PM

తాజాగా గెలిచిన కూటమి స ర్పంచులు శుక్రవారం ఎమ్మెల్యే వర్గంలో చేరా రు.

కూటమి సర్పంచుల చూపు ఎమ్మెల్యే వైపు
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వర్గంలో చేరిన కూటమి సర్పంచు

  • ఎమ్మెల్యేవర్గంలో చేరిన ముగ్గురు సర్పంచులు, ఉపసర్పంచులు

గద్వాల న్యూటౌన్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తాజాగా గెలిచిన కూటమి స ర్పంచులు శుక్రవారం ఎమ్మెల్యే వర్గంలో చేరా రు. గ్రామాల అభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా ఎమ్మెల్యే సహకారం ఉంటేనా సాధ్యమవుతుందని భావించి, మొదటి విడతలో గెలిచిన కూటమి సర్పంచు లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మిఠాయిలు తినిపించారు. ఎమ్మెల్యే వర్గంలో చేరిన వారిలో గద్వాలమండలం రేకులపల్లి సర్పం చు సత్యమ్మ, ఉపసర్పంచు సహదేవుడు, వార్డు సభ్యులు, ధరూర్‌ మండలం మాల్‌దొడ్డి సర్పం చు పరమేష్‌, ఉపసర్పంచు భీమేష్‌, వార్డు స భ్యులు, అలాగే కే.టి.దొడ్డి మండలం ఇర్కిచేడు సర్పంచు ఆంజనేయులు,ఉపసర్పంచు లక్ష్మణ్‌తో పాటు వార్డు సభ్యులు ఉన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:52 PM