మార్మోగిన గోవింద నామస్మరణ
ABN , Publish Date - Dec 21 , 2025 | 10:53 PM
దర్మాన్ని మనం రక్షి స్తే అది మనల్ని రక్షిస్తోందని ధర్మవాహిని ప రిషత్ వ్యవస్థాపకుడు జ్యోషి సంతోషాచారులు పేర్కొన్నారు.
- జనసంద్రంగా ‘పదరా పోదాం మన్యంకొండ’ పాదయాత్ర
మహబూబ్‌నగర్ న్యూటౌన్/రూరల్, డిసెం బరు 21 (ఆంధ్రజ్యోతి) : దర్మాన్ని మనం రక్షి స్తే అది మనల్ని రక్షిస్తోందని ధర్మవాహిని ప రిషత్ వ్యవస్థాపకుడు జ్యోషి సంతోషాచారులు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పాండు రంగ స్వామి ఆలయం నుంచి ధర్మవాహిని పరి షత్, స్వర లహరి కల్చరల్ అకాడమీ ఆధ్వ ర్యంలో పదరా పోదాం మన్యంకొండకు మూడో పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్ర లో దాదాపు 2500 మంది భక్తులు పాల్గొన్నారు. పాదయాత్రలో భక్తులు అడుగుల భజనలు, స్వామివారి సంకీర్తనలు ఆలపించారు. మ న్యంకొండకు చేరుకుని స్వామి వారికి పట్టు వ స్త్రాలు సమర్పించారు. ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. స్వర లహరి కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు నాయిని భాగన్నగౌడ్, మన్యంకొండ బోర్డు మెంబర్ కనికె శ్రావణ్, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్ గౌడ్, అంజయ్య, వేద వ్రత్, డీకే ఆంజనేయులు, నరేందర్, కేఎస్ రవి కుమార్, ధర్మవాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.