Share News

సమ్మెతో కేంద్రాన్ని బోనులో నిలబెట్టాలి

ABN , Publish Date - May 12 , 2025 | 11:15 PM

దేశవ్యాప్త సమ్మెతో కేంద్ర ప్రభుత్వాన్ని బోన్‌లో నిలబెట్టాలని టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎం ఖలీల్‌ పిలుపునిచ్చారు.

సమ్మెతో కేంద్రాన్ని బోనులో నిలబెట్టాలి
మాట్లాడుతున్న టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం ఖలీల్‌

- రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు

పాలమూరు, మే 12 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్త సమ్మెతో కేంద్ర ప్రభుత్వాన్ని బోన్‌లో నిలబెట్టాలని టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎం ఖలీల్‌ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలు ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించారు. టీఎఫ్‌టీయూ యాదగిరి, పి.విజయకుమార్‌, ఆల్‌మేవ అధ్యక్షుడు ఫారూఖ్‌హుస్సేన్‌, ఎండీ అయూబ్‌, పాలమూరు అధ్యయన వేదిక కేసీ వెంకటేష్‌, ఎ.తిమ్మన్న, డీటీఎఫ్‌ రవీందర్‌గౌడ్‌, ప్రభాకర్‌, వామన్‌కుమార్‌, చైతన్య మహిళా సంఘం శ్రీదేవి, హనీఫ్‌ అహ్మద్‌, స్కూల్‌ స్వీపర్ల సంఘం జి.గట్టన్న, చండ్రాయుడు, బి.రాజు, యం.శ్రీనివాసులు, బాలకృష్ణ, జలాల్‌పాష, ముక్తార్‌, యంఏ రహీం, జైపాల్‌, నిజాముద్దీన్‌ ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా వలస కార్మికుల కష్టాలకు కన్నీళ్లకు గురవుతోందన్నారు. అలాంటి కార్మికుల మరణాలు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కార్మిక చట్టాలన్నింటిని మల్టినేషనల్‌ కంపెనీలకు అనుకూలంగా మార్చేశారన్నారు. 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రజలు, కార్మికులు అధిక సంఖ్యలో పాలు పంచుకోవాలన్నారు.

Updated Date - May 12 , 2025 | 11:15 PM