గిరిజనుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:48 PM
గిరిజనుల హక్కులను కా లరాస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండ గడుదామని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్య నాయక్ అన్నారు.
వనపర్తి టౌన్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : గిరిజనుల హక్కులను కా లరాస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండ గడుదామని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్య నాయక్ అన్నారు. ఆ దివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌ రస్తాలో ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని జ రుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... 1996లో ఐక్యరాజ్య సమితి గిరిజనులకు హక్కులు కల్పించిందన్నారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కేంద్ర ప్ర భుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. గి రిజనుల హక్కులు సాధించుకునేందుకు ప్రతీ ఒక్కరు సంసిద్ధులు కావాలని, గిరిజనులకు రా వాల్సిన సంక్షేమ పథకాలు, మౌలిక వసతులతో పాటు అడివి భూములపై హక్కులు కల్పిస్తు పట్టాలు ఇవ్వాలన్నారు. గిరిజన సంఘం నాయ కులు బాలు నాయక్, సోమ్లా నాయక్, రవి నా యక్, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.