Share News

42శాతం బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలి

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:31 PM

తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన 42శాతం బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు డిమాండ్‌ చేశారు.

42శాతం బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలి
తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేస్తున్న సీపీఎం శ్రేణులు

పాలమూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన 42శాతం బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు డిమాండ్‌ చేశారు. బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రం లోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ బీసీల పట్ల బీజేపీ ప్రభు త్వం ఆడుతున్న కపట నాటకం ప్రజలు గమ నిస్తున్నారని పేర్కొన్నారు. బీసీ బిల్లును ఆమో దింపచేయకుంటే రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు 8మంది రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశా రు. బీజేపీ ఎంపీలు ఆబద్దాల మాటలు చెప్ప టం సరికాదన్నారు. కిల్లెగోపాల్‌ మాట్లాడుతూ వి.పి. సింగ్‌ ప్రధాన మం త్రిగా ఉన్నప్పుడు బీపీ మం డల్‌ కమిషన్‌ దేశవ్యాప్తంగా బీసీల సర్వే నిర్వహించి కమి షన్‌ రిపోర్టు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు మండ లి ఉద్యమాన్ని తీసుకువ చ్చిందని గుర్తుచేశారు. నల్ల వెల్లి కురుమూర్తి, చంద్రకాం త్‌, మోహన్‌, దీప్లానాయక్‌, రాజ్‌, భరత్‌, రాములు, ఖ య్యూం, భగవంతు, శ్రీనాథ్‌, వెంకట్రాములు, బాలయ్యలు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2025 | 11:31 PM