Share News

అభ్యర్థుల లెక్కలు పక్కాగా ఉండాలి

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:56 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల లెక్కలు పక్కాగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా అసిస్టెంట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అబ్జర్వర్‌ మహేశ్‌ అన్నారు.

అభ్యర్థుల లెక్కలు పక్కాగా ఉండాలి

  • అసిస్టెంట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అబ్జర్వర్‌ మహేశ్‌

అయిజ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల లెక్కలు పక్కాగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా అసిస్టెంట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అబ్జర్వర్‌ మహేశ్‌ అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలోని తన గదిలో ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఎన్నికలలో సర్పంచు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అ భ్యర్థులు ఎన్నికల ఖర్చులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు అందజేయాలన్నారు. అందుకు సంబంధించి అభ్యర్థులకు ఈ విషయ మై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి అవ గాహన కల్పించామన్నారు. వారికి బ్యాంకులో ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేసి, బుక్‌లెట్‌ అందజే శామని తెలిపారు. ప్రతీ రోజు తాము చేసిన ఖర్చుల వివరాలు అందులో పొందపరచాలని తెలిపారు. పోటీలో ఓడినా, గెలిచినా ఖర్చుల వివరాలు 45 రోజుల్లోపు అందజేయాలన్నారు. ఐదువేల జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచు అభ్యర్థి రూ.2,50,000లు, వార్డు సభ్యులు, రూ. 50,000, 5వేల లోపు జనాభా గ్రామాల సర్పం చు అభ్యర్థి రూ.1,50,000, వార్డు సభ్యులు రూ.30,000 ఖర్చు చేయాల్సి ఉంటుందని వివ రించారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే గెలిచిన, ఓడిన వారికి చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.

Updated Date - Dec 11 , 2025 | 11:56 PM