Share News

బస్సులు వచ్చేశాయ్‌..

ABN , Publish Date - Mar 12 , 2025 | 10:49 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సులకు యాజమాన్య హక్కులను కల్పించింది. ఈ బస్సులను మహిళలు ఆర్టీసీలో అద్దెకు నడిపించడం ద్వారా ఆదాయన్ని పొందనున్నారు.

బస్సులు వచ్చేశాయ్‌..
మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌లో ఉన్న ఇందిరా మహిళా శక్తి బస్సు

ఉమ్మడి జిల్లాలో మహిళా సంఘాలకు 49 కేటాయింపు

ఒక్కో బస్సు విలువ రూ.33 లక్షలు

ఆర్టీసీలో అద్దెకు నడపడం ద్వారా ఆదాయం

మహబూబ్‌నగర్‌ టౌన్‌, మార్చి 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సులకు యాజమాన్య హక్కులను కల్పించింది. ఈ బస్సులను మహిళలు ఆర్టీసీలో అద్దెకు నడిపించడం ద్వారా ఆదాయన్ని పొందనున్నారు. ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 600 బస్సుల యాజమాన్య హక్కులను మహిళా సంఘాలకు కల్పించగా, ఉమ్మడి జిల్లాకు 49 బస్సులను కేటాయించారు. ఒక్కో బస్సు విలువ రూ.33 లక్షలు ఉంటుంది. బస్సులపై ఇందిరా మహిళా శక్తి అనే పేర్లు ఉన్నాయి. బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించారు.

జిల్లాల వారీగా కేటాయింపు..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట డిపోకు 5 బస్సులు కేటాయించారు. కల్వకుర్తి డిపోకు 4, కొల్లాపూర్‌ డిపోకు 2, నాగర్‌కర్నూల్‌ డిపోకు 2, జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల డిపోకు 4 బస్సులు ఇచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మహబూబ్‌నగర్‌ డిపోకు 5, రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్‌నగర్‌కు 17, నారాయణపేట జిల్లాలోని నారాయణపేట డిపోకు 2, కోస్గి డిపోకు 1, వనపర్తి డిపోకు 7 బస్సుల చొప్పున వచ్చాయి.

వినియోగించుకుంటే మంచి లాభాలు

ప్రభుత్వం బస్సులను మహిళా సంఘాల పేరిట కొనుగోలు చేసి, ఆర్టీసీలో అద్దెకు నడిపే అవకాశం కల్పించిందని ఆర్‌ఎం సంతో్‌షకుమార్‌ తెలిపారు. సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా వృద్థిలోకి రావాలని కోరారు.

Updated Date - Mar 12 , 2025 | 10:49 PM