వడ్డెరుల కట్టడాలు... సంస్కృతికి సాక్ష్యాలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:45 PM
వడ్డెరుల కట్టడాలు, నిర్మాణాలు భారత సంస్కృతిక సాక్ష్యాలుగా నిలి చాయని వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు దాసర్ల భూమయ్య తెలిపారు.
ఖిల్లాఘణపురం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : వడ్డెరుల కట్టడాలు, నిర్మాణాలు భారత సంస్కృతిక సాక్ష్యాలుగా నిలి చాయని వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు దాసర్ల భూమయ్య తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం 74వ వడ్డెర విము క్త జాతుల దినోత్సవం సంద ర్భంగా వడ్డెర సంఘం మండ ల అధ్యక్షుడు ఓర్సు యాదయ్య ఆధ్వర్యంలో వ డ్డెరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు డాసర్ల భూమయ్య మాట్లాడుతూ.. సంచార, అర్థ సం చార విముక్త సమాజంలో వడ్డెర కులస్తులు మ ట్టిలో మాణిక్యాలుగా చరిత్రలో నిలిచారని అభివ ర్ణించారు. సనాతన ఽధర్మానికి వారసులుగా కళల మనుగడను సంరక్షిస్తూ.. సంస్కృతిక వైభవం పునరుద్ధరణ కోసం బాటలు వేస్తూ.. సంచార జీవనం గడిపారని గుర్తు చేశారు. వడ్డెర వృతి కోసం దేశం న లుమూలల సంచారం చేస్తూ.. దేశ భక్తితో స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం పో రాడారని గుర్తు చేశారు. వడ్డెరుల కట్టడాలు, ని ర్మాణాలు, తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, గం గిరెద్దుల ఆటలు పాటలు, హరికథలు, డప్పు వాయిద్యాలు లాంటి కళలలో నైతికత, జాతీ యత, సాంస్కృతిక పరంపర ప్రకృతిలో జీవనా ధారం పొందినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు దాసర్ల శ్రీరాములు, మల్లేష్, తిరపతి, బీచ్ పల్లి, నాగరాజు, వెంకటేష్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.