Share News

సత్తాచాటిన ‘పల్లెటూరి కుర్రాళ్లు’

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:20 PM

జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన పల్లెటూరి కుర్రాళ్లు (యూట్యూబ్‌ ఛానెల్‌) పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబరు 21 నిర్వహించిన రాష్ట్రస్ధాయి షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలో రెండవ బహుమతి సాధించారు.

సత్తాచాటిన ‘పల్లెటూరి కుర్రాళ్లు’
డీజీపీ శివధర్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న పల్లెటూరి కుర్రాళ్లు టీం

- పోలీసు అమరవీరుల షార్ట్‌ఫిల్మ్‌ అవార్డుకు ఎంపిక

- అభినందించిన డీజీపీ, ఎస్పీ

గద్వాల క్రైం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన పల్లెటూరి కుర్రాళ్లు (యూట్యూబ్‌ ఛానెల్‌) పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబరు 21 నిర్వహించిన రాష్ట్రస్ధాయి షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలో రెండవ బహుమతి సాధించారు. హెల్మెట్‌ లేకుండా, త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తూ వెళ్లే యువకుల నిర్లక్ష్యం, రెకమండేషన్లు కాదు.. రోడ్డు భద్రతా నియమాలే ప్రాణాలను కాపాడుతాయనే సందేశాన్ని షార్ట్‌ఫిల్మ్‌లో ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ స్టేడియంలో జరిగిన అవార్డు కార్యక్రమంలో డీజీపీ శివధర్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు. ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన టీం ఖదీర్‌, దేవేందర్‌, హరిప్రసాద్‌, రాజు, పరశురాంలను ఎస్పీ శ్రీనివాసరావు శనివారం ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయంతో జిల్లా రాష్ట్రంలో మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుందని ఎస్పీ తెలిపారు.

Updated Date - Nov 15 , 2025 | 11:20 PM