Share News

భూసమస్యల పరిష్కారానికే ‘భూభారతి’ చట్టం

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:18 PM

ఎన్నో సంవత్సరా లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుం దని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ స్పష్టం చేశారు.

భూసమస్యల పరిష్కారానికే ‘భూభారతి’ చట్టం
భూభారతి సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

కోస్గి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నో సంవత్సరా లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుం దని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ స్పష్టం చేశారు. శుక్రవారం కోస్గి మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ నర సింహా ఫంక్షన్‌ హాలులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు ఈ కొత్త చట్టంలోని సెక్షన్‌లపై అవగాహన పెంచుకోవా లని సూచించారు. పాత చట్టంలోని లోటు పాట్లు, కొత్త చట్టంలోని వెసలు బాట్ల గురించి కలెక్టర్‌ వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయాల సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు భీంరెడ్డి, తహసీల్దార్లు బక్క శ్రీనివాస్‌, భాస్కరస్వామి, ఎంపీడీవో శ్రీధర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ నాగరాజు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి తది తరులున్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:18 PM