సాయుధ రైతాంగ పోరాటం మహోత్తరమైంది
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:30 PM
946 నుంచి 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మహోత్తరమైదని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు, కిల్లె గోపాల్ పేర్కొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు
పాలమూరు, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : 1946 నుంచి 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మహోత్తరమైదని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు, కిల్లె గోపాల్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో బస్టాండ్ నుంచి అశోక్‌టాకీసు చౌరస్తా మీదుగా క్లాక్‌టవర్ వరకు డప్పుల ప్రదర్శన చేపట్టారు. సెప్టెంబరు 10 నుంచి 17వరకు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూస్వామ్య పీడనకు, నైజాం నవాబు పరిపాలనకు వ్యతిరేకంగా మహాత్తర పోరాటం సాగిందన్నారు. ఈ పోరాటంలో బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ వారు ముస్లింలపై హిందువులు విజయం సాధించినట్లు వక్రీకరిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాణిక్యంరాజు, కుర్మయ్య, టీపీఎస్‌కే జిల్లా కార్యదర్శి కురుమూర్తి, ఐద్వా పద్మ, చంద్రకాంత్, రాజ్, శివలీల, మల్లేష్, రాజు, పాండు, రాము, చరణ్, వేణుగోపాల్, రాందాసు, నరసింహులు, శివ పాల్గొన్నారు. దని రైతులు చెబుతున్నారు.