Share News

దేశభక్తిని పెంపొందించడమే ఆర్‌ఎస్‌ఎస్‌ ధ్యేయం

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:30 PM

సమాజంలో దేశభక్తిని పెంపొందించడమే రాష్ట్రీ య స్వయం సేవక్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ధ్యేయంగా శతాబ్ధి ఉత్సవాలను నిర్వహిస్తుందని సంఘ చా లక్‌ వక్త శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

దేశభక్తిని పెంపొందించడమే ఆర్‌ఎస్‌ఎస్‌ ధ్యేయం

ఖిల్లాఘణపురం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో దేశభక్తిని పెంపొందించడమే రాష్ట్రీ య స్వయం సేవక్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ధ్యేయంగా శతాబ్ధి ఉత్సవాలను నిర్వహిస్తుందని సంఘ చా లక్‌ వక్త శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రీయ స్వ యం సేవక్‌ శతాబ్ధి ఉత ్సవాల్లో భాగంగా సర్వ స్వయం సేవకుల సమావేశం ఆదివారం మండ ల కేంద్రంలోని బాదం సరోజిని దేవి ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీని వాస్‌రెడ్డి మాట్లాడుతూ... హిందూ ధర్మం హిం దూ సంస్కృతిని పరిరక్షిస్తూ, దేశం ఉన్నతిని సాధించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 1925 నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖను వ్యక్తి నిర్మా ణం హిందూ ధర్మ సంరక్షణ చేస్తూ.. పరిస్థితు లకు అనుగుణంగా వివిధ రంగాల్లో వివిధ సం స్థలను నెలకొల్పి స్వాభిమానం గల కార్యకర్తల ను తయారు చేస్తున్నారని అన్నారు. ప్రతీ గ్రా మంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సభ్యులను త యారు చేయాలన్నారు. సంఘ వికాసంతో పా టు దేశ అంతర్గత వ్యతిరేక శక్తులను అధిగమిం చి ప్రపంచ దేశాల్లోని హిందువులను సంఘటి తం చేస్తు అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలబ డిందని అన్నారు. కార్యక్రమంలో యుగంధర్‌, బెస్త భాస్కర్‌, ఆంజనేయులు, నారాయణ, శ్రీని వాసులు, క్యామ భాస్కర్‌, అశోక్‌ గౌడ్‌ తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:30 PM