అన్ని వర్గాల అభ్యున్నతి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:10 PM
అన్నివర్గాల అభ్యున్నతి ఒక్క బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.

- పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
మద్దూర్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): అన్నివర్గాల అభ్యున్నతి ఒక్క బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఈనెల 27న వరంగల్‌లో జరగబోయే బీఆర్‌ఎస్ రజతోత్సవ సమావేశం సందర్భంగా మద్దూర్‌లో శుక్రవారం ఆ పార్టీ మండల ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఈనెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ అభిమానులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఫూలే చేసిన కృషిని కొనియా డారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ, మండల నాయకులు సలీం, శాసం రామకృష్ణ, వీరారెడ్డి, గోపాల్, మధుసూదన్‌రెడ్డి, బసిరెడ్డి, తిరుపతి, మైపాల్, మహేందర్, బాల్‌చెందర్, వెంకటయ్య, కృష్ణ, హబీబ్, వెంకటేశ్, సాయిలు తదితరులున్నారు.