Share News

టెట్‌ టెన్షన్‌

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:17 PM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు టెట్‌(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) భయం పట్టుకుంది. నూతన విద్యా విధానంలో భాగంగా ఎన్‌సీఆర్టీ నిబంధనల మేరకు ఐదేళ్ల సర్వీస్‌ పైబడి ఉన్న ఉపాధ్యాయులంతా టెట్‌లో ఉత్తీర్ణత కావడం తప్పనిసరిగా మారింది.

టెట్‌ టెన్షన్‌

వచ్చే నెల 3 నుంచి పరీక్ష

పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఉపాధ్యాయులు

ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు టెట్‌(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) భయం పట్టుకుంది. నూతన విద్యా విధానంలో భాగంగా ఎన్‌సీఆర్టీ నిబంధనల మేరకు ఐదేళ్ల సర్వీస్‌ పైబడి ఉన్న ఉపాధ్యాయులంతా టెట్‌లో ఉత్తీర్ణత కావడం తప్పనిసరిగా మారింది. రెండేళ్లలో వ్యవధిలో టెట్‌ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. లేదంటే ఉద్యోగం నుంచే తొలగించన్నుట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఖాళీ సమయంలో, ఇంట్లో పరీక్షకు సిద్ధం అవుతున్నారు.

5,600 మంది దరఖాస్తు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. వారిలో 2010 తర్వాత నియామకం అయిన ఉపాధ్యాయులు టెట్‌ అర్హత సాధించారు. అంతకు ముందు ఉద్యోగం పొందిన వారు టెట్‌తో సంబంధం లేకుండా విధుల్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గ తంలో నిర్వహించిన టెట్‌లో కొందరు ఉత్తీర్ణత సాధించారు. ఇంకా 70 శాతానికి పైగా సా ధించలేదు. ఐ దేళ్ల సర్వీస్‌ లోబడి ఉన్నవారికి టెట్‌ ఉత్తీర్ణత అవసరం లేదని ఎన్‌సీఆర్టీ ప్రకటిచడంతో వారు ఊ పిరి పీల్చుకున్నారు. మిగ తా వారికి టెట్‌ తప్పని సరికావడంతో పరీక్ష రాయడానికి 5,600 మంది దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి.

3 నుంచి పరీక్ష

ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ ఆన్‌లైన్‌లో జనవరి 3 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. అందుకు రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. హాల్‌ టికెట్స్‌ శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా తీసుకునేందుకు సి ద్ధంగా ఉంచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టెట్‌ రాసేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా కేం ద్రంలోనే రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. టెట్‌ రాసేందుకు ఉపాధ్యాయులతోపాటు డైట్‌, బీఎడ్‌, పండిత్‌ శిక్షణ పొందిన నిరుద్యోగ అఽభ్యర్థులు సూమారు 40 వేల మంది వరకు హాజరు కానున్నారు.

వద్దంటున్న సంఘాల నాయకులు

2010కి ముందు డీ ఎస్సీ రాసి, ఉ పాధ్యాయులుగా ఎంపికైన వారికి టెట్‌తో ముడిపెట్టవద్దని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాఽధ్యాయులు అంటున్నారు. కొన్ని సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కుడా రాశారు. గత ఎన్నికల్లో అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి టెట్‌పై ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొందరు నాయకులు కేంద్ర మంత్రులను, ఎంపీలను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలల్లో టెట్‌ రద్దు కోసం విద్యాహక్కు చట్టంలో మార్పు చేయాలని, ఉపాధ్యాయులుగా విఽధులు నిర్వర్తిస్తున్న టీచర్లకు టెట్‌ అర్హత తప్పని సరి కాదని చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Dec 26 , 2025 | 11:17 PM