టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:17 PM
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజును తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కురువ పల్లయ్య గురువారం గద్వాలలోని జిల్లా గ్రంథాలయం ఎదుట డీఎస్సీ అభ్య ర్థులు, బీఆర్‌ఎస్వీ నాయకులతో కలిసి నిరసన కు దిగారు.
బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థుల నిరసన
గద్వాల సర్కిల్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజును తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కురువ పల్లయ్య గురువారం గద్వాలలోని జిల్లా గ్రంథాలయం ఎదుట డీఎస్సీ అభ్య ర్థులు, బీఆర్‌ఎస్వీ నాయకులతో కలిసి నిరసన కు దిగారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఫీజు తీసుకోకుండా టెట్‌తో పాటు పోటీ పరీక్షల కు సంబంధించి ఉద్యోగార్థుల నుంచి ఉచితంగా దరఖాస్తులు స్వీకరిస్తామని హామీ ఇచ్చిన కాం గ్రెస్ గద్దెనెక్కాక నిరుద్యోగులకు ఇచ్చిన హామీ లు మరిచి నిండా ముంచేస్తోందని మండిపడ్డారు. జాబ్‌క్యాలెండర్ ద్వారా నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పి, నేడు అందుకు వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ముందుకుపోతోందని దుయ్యబట్టారు. ఉచితం గా టెట్ దరఖాస్తులు స్వీకరించాల్సిందిపోయి ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.వె య్యి వసూలుచేయడం నిరుద్యోగుల పొట్ట కొట్టడమే అన్నారు. టెట్ ఫీజును తగ్గించాలి, లేదా ఉచిత ంగా దరఖాస్తులు చేసుకునేలా రీనోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహేశ్, మాధవ్, నరేశ్, చిన్నా రి, చక్రవర్తి, డీఎస్పీ అభ్యర్థులు పాల్గొన్నారు.