బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబు
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:40 PM
కురుమూర్తి వేంటేశ్వ రస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 20 నుంచి ప్రారంభమవుతున్నాయి.
చిన్నచింతకుంట, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కురుమూర్తి వేంటేశ్వ రస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 20 నుంచి ప్రారంభమవుతున్నాయి. సరి గ్గా దీపావళి అమావాస్య రోజునుంచి ప్రారంభం కానుండటంతో స్వామి ఆలయం ముస్తాబవుతోంది. దానికి సంబంధించిన మెట్లు, క్యూలైన్‌ల వద్ద స్వామి వారి ప్రధాన గోపురం తదితర వాటికి రంగులు అద్దే కార్యక్రమం కొనసాగుతోంది. జాతర మైదానంలో ఇప్పటికే వి విధ రకాల రంగుల రాట్నాలు దుకా ణాలు, దుకాణ సముదాయాలు వం టివి ఏర్పాట్లు చేసేందుకు ముమ్మ రంగా సాగుతున్నాయి.