Share News

కేంద్ర భాగస్వామ్యంతోనే తెలంగాణ అభివృద్ధి

ABN , Publish Date - May 02 , 2025 | 11:05 PM

తెలంగా ణా అభివృద్ధిలో కేంద్ర సహకారం ఎంతో ఉందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే.అరుణ అన్నారు.

కేంద్ర భాగస్వామ్యంతోనే తెలంగాణ అభివృద్ధి
భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎంపీ డీకే.అరుణ

- ఎంపీ డీకే అరుణ

కొత్తపల్లి, మే 2 (ఆంధ్రజ్యోతి): తెలంగా ణా అభివృద్ధిలో కేంద్ర సహకారం ఎంతో ఉందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే.అరుణ అన్నారు. శుక్రవారం కొత్తపల్లి మండలంలోని అల్లీపూర్‌ గ్రామ శివారులో వెలసిన తిరుమలనాథస్వామి ఆలయ ఆవరణలో ఎంపీ నిధులు రూ.7 లక్షలతో నిర్మించనున్న భవన నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. అలాగే గ్రామంలో రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్‌ను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలమూరు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు నాగురావునామాజీ, రతంగ్‌పాండురెడ్డి, అనంత్‌రెడ్డి, పడాకుల శ్రీనివాస్‌, పవన్‌కుమార్‌రెడ్డి, అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటయ్య, విజయభాస్కర్‌ రెడ్డి తదితరులున్నారు.

Updated Date - May 02 , 2025 | 11:05 PM