ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:31 PM
సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తిరుమల హిల్స్‌లో నిర్వహించిన రిషి వెంకటయ్య స్వ్ఛంద పదవీ విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. ఉపాధ్యాయుడిగా 30 సంవత్సరాలు సేవలు అందించి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థ్థాయికి తీసుకెళ్లారని, విద్యాభివృద్ధికి ఆయన సేవలు మరువ లేనివన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు తన వంతుగా కాలేజీని ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు తక్కువ ఫీజులతో విద్యనందించారని గుర్తు చేశారు. ఇక ముందు మరిన్ని విజయాలు సాధించాలన్నారు. ఈ సందర్భంగా రిషి విద్యాసంస్థల అధినేత చంద్రకళ వెంకటయ్య దంపతులను గజమాలతో సత్కరించారు. డీఐఈవో కౌసర్‌జాహన్ పాల్గొన్నారు.