ఉపాధ్యాయులు శిక్షణను వినియోగించుకోవాలి
ABN , Publish Date - May 23 , 2025 | 11:15 PM
వెనుకబడిన విద్యార్థులను ముందుకు తీసుకు పోవడం కోసం ఇచ్చే శిక్షణను ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని డీఈవో గోవిందరాజులు కోరారు.

· డీఈవో గోవిందరాజులు
ధన్వాడ/మరికల్, మే 23 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన విద్యార్థులను ముందుకు తీసుకు పోవడం కోసం ఇచ్చే శిక్షణను ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని డీఈవో గోవిందరాజులు కోరారు. ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న శిక్షణను శుక్రవారం డీఈవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన శిక్షణను పరిశీలించి, ఉపాధ్యాయులతో మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని కోరారు. విద్యార్థులకు బోధన ఎలా ఉండాలో ఆర్పీలు ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈవో గాయత్రి, సీఆర్పీలు ఎం.నారాయణ, వెంకట్రాములు పాల్గొన్నారు.
అదేవిధంగా, మరికల్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయ శిక్షణ తరగతులను శుక్రవారం డీఈవో గోవిందరాజులు, డైట్ కళాశాల లెక్చరర్ సిరాజుద్దీన్‌లు తనిఖీ చేసి, మాట్లాడారు. విద్యార్థులు పదాలు గుర్తించడం, వాటిని అర్థం చేసుకోవడం, సరళమైన గణిత భావనలను నేర్చుకోవడం వంటి విషయాలను వారు వివరించారు. కార్యక్రమంలో ఎంఈవో మనోరంజని, మండలంలోని వివిధ పాఠశాలల ఎస్‌జీటీ, పీఎస్‌ల హెచ్‌ఎంలు, మండల వనరుల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.