గర్వపడేది ఉపాధ్యాయులే
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:17 PM
తాము చెప్పిన పాఠాలు విన్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరితే మొదటగా గర్వపడేది ఉపాధ్యాయులేని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల సర్కిల్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): తాము చెప్పిన పాఠాలు విన్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరితే మొదటగా గర్వపడేది ఉపాధ్యాయులేని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో శుక్రవారం హెల్పింగ్ హ్యాండ్స్ ఛారిటబుల్ ట్ర స్ట్ ఛైర్మన్ రత్నసింహారెడ్డి ఆధ్వర్యాన నిర్వహించిన పదో తరగతి ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. సమాజంలో విద్యకు ప్రత్యేకమైన గౌరవం ఉం దని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాల స్థాయి నుం చే గొప్ప లక్ష్యాలతో ముందుకెళ్లాలని సూచించా రు. తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చేలా ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థా యికి చేరుకోవాలని హితవు పలికారు. శ్ర మ, సమయాన్ని కెటాయించి స్టడీ మెటీరియల్ కసరత్తుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు, వాటి ని ఉచితంగా విద్యార్థులకు అందించేందుకు ముందుకు వచ్చిన హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఛైర్మన్ రత్నసింహారెడ్డిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీసీఈబీ జిల్లా కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, గద్వాల ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్, పాఠశాల జీహెచ్‌ఎం వెంకటనర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ జంబు రామన్‌గౌడ, పుర మాజీ వైస్ ఛైర్మన్ బాబర్, ఉపా ధ్యాయులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.