విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:19 PM
పరీక్ష రాయడానికి విద్యార్థులు మెల్లగా వస్తున్నారని విద్యార్థులనుద్దేశించి ఉపాధ్యాయుడు జోక్ వేశా రు..
కల్వకుర్తి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పరీక్ష రాయడానికి విద్యార్థులు మెల్లగా వస్తున్నారని విద్యార్థులనుద్దేశించి ఉపాధ్యాయుడు జోక్ వేశా రు.. దీంతో విద్యార్థులు నవ్వారని సదరు ఉపా ధ్యాయుడు వాతలు పడేలా కర్రతో చితకబాదా డు.. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వ కుర్తి పట్టణంలోని స్టేడియంలో నడుస్తున్న బీసీ గురుకుల పాఠశాలలో గురువారం వెలుగు చూ సింది. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను తరచు గా దండిస్తాడని ఆరోపణలు వ్యక్తమవుతు న్నా యి. విద్యార్థులను ఆసుపత్రికి తరలించకుండా పాఠశాలలో చికిత్స అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పరీక్ష రాయడానికి మెల్లిగా న డుస్తున్నామనే కారణంతో ఉపాధ్యాయుడు జోక్ వేస్తే నవ్వామన్నారు. కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న బీఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా గురువారం గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం బయటకుచెబితే టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తామని విద్యార్థులను బెదిరిస్తున్నారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ లోపంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వెంటనే ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీఎస్‌ఎఫ్ నాయకులు రామచందర్, ఆంజనేయులు, రమేష్, నాగరాజు, సైదులు పాల్గొన్నారు.